వైరల్ వార్తలు

జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు బెడ్‌షీట్ల పంపిణీ

జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు బెడ్‌షీట్ల పంపిణీ

జనం న్యూస్ ఆగస్టు 24 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి లయన్స్ క్లబ్ ఆఫ్ కూకట్‌పల్లి ఆధ్వర్యంలో జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు బెడ్‌షీట్లను పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ కూకట్‌పల్లి అధ్యక్షులు యక్కంటి వెంకటరెడ్డి మాట్లాడుతూ, నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు ఎంతో విలువైనవని, వారి సేవలను గుర్తించి వారికి అవసరమైన సహాయాన్ని అందించడం తమ క్లబ్ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో లయన్ అన్యేం కోటిరెడ్డి లయన్స్ క్లబ్ ఆఫ్ కూకట్‌పల్లి సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. పారిశుద్ధ్య కార్మికులు లయన్స్ క్లబ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి మరింత మేలు చేయడమే లయన్స్ క్లబ్ ఆఫ్ కూకట్‌పల్లి లక్ష్యం.

ఇ-పేపర్