తెలంగాణ

పరకాల డివిజన్ కమిటీలో శాయంపేటకు ప్రాతినిధ్యం..సతీష్‌కుమార్‌కు సంయుక్త కార్యదర్శి.. కార్తీక్‌కు కార్యవర్గ సభ్యుడి బాధ్యతలు

పరకాల డివిజన్ కమిటీలో శాయంపేటకు ప్రాతినిధ్యం..సతీష్‌కుమార్‌కు సంయుక్త కార్యదర్శి.. కార్తీక్‌కు కార్యవర్గ సభ్యుడి బాధ్యతలు

జనం న్యూస్ సెప్టెంబరు 11 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం టీయూడబ్ల్యూజే–ఐజేయూ పరకాల డివిజన్ నూతన కార్యవర్గంలో మండలానికి చెందిన కొమ్ముల సతీష్‌కుమార్‌ను సంయుక్త కార్యదర్శిగా, బత్తుల కార్తీక్‌ను కార్యవర్గ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.జిల్లా అధ్యక్షుడు గడ్డం కేశవమూర్తి అధ్యక్షతన, రాష్ట్ర హౌసింగ్ బోర్డు వెల్ఫేర్ కార్యదర్శి వల్లాల వెంకటరమణ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గాడేపల్లి మధు, జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిరాం, ప్రెస్‌క్లబ్ కోశాధికారి అమర్ తదితరుల ఆధ్వర్యంలో ఎన్నిక జరిగింది.తమ ఎన్నికకు సహకరించిన జిల్లా సహాయ కార్యదర్శి గన్ను సంతోష్‌కుమార్, కార్యవర్గ సభ్యుడు రంగు శ్రీధర్‌లకు సతీష్‌కుమార్, కార్తీక్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తమ ఎన్నికకు సహకరించిన రాష్ట్ర, జిల్లా నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి బాధ్యతాయుతంగా పనిచేస్తామని వారు పేర్కొన్నారు…

ఇ-పేపర్