విద్యార్థులు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలి
సృజనాత్మకతకు సమ్మర్ క్యాంపులు కీలకం
జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎస్కే జాఫర్
(జనం న్యూస్-మే 09-కందిబండ హరీష్ మునగాల మండల రిపోర్టర్) మునగాల మండల పరిధిలోని ఆకుపాముల గ్రామంలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యా విషయక సమ్మర్ క్యాంపును శనివారం జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎస్కే జాఫర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడి శాస్త్రీయ ఆలోచనలు పెంపొందించే పలు ప్రయోగాలు నిర్వహించారు.సమ్మర్ క్యాంపులు విద్యార్థుల్లో సృజనాత్మకత, పరిశోధనా దృక్పథాన్ని పెంచుతాయని,విద్యార్థులు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకుని విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని ఆయన సూచించారు.