ePaper

మోడల్ స్కూల్ లో వేసవి శిక్షణ తరగతులు : ప్రిన్సిపల్ బి. సైదయ్య గౌడ్

May 9, 2026 | వైరల్ వార్తలు

(జనం న్యూస్-మే 09-కందిబండ హరీష్ మునగాల మండల రిపోర్టర్) మునగాల మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ లో ఈనెల 11 నుంచి ఈనెల 25 వరకు సమ్మర్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ బి. సైదయ్య గౌడ్ తెలిపారు. మోడల్ స్కూల్ విద్యార్థులతో పాటు, పరిసర గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 9 తరగతులు చదువుతున్న విద్యార్థులు అర్హులని ఆయన పేర్కొన్నారు.మొత్తం 100 మంది విద్యార్థులకు మాత్రమే ప్రవేశం కల్పిస్తామని, ఆసక్తి గల వారు వెంటనే పాఠశాల కార్యాలయంలో సంప్రదించాలని ఆయన సూచించారు.