మేతల కంపెనీలన్నీ సిండికేట్… ఆక్వారైతులను నిలువ దోపిడీ

May 14, 2026 | వైరల్ వార్తలు

ఆక్వా రైతు సంఘ నాయకుడు నాగ భూషణం.. ఆధ్వర్యంలో
జనం న్యూస్ మే 14 ముమ్మిడివరం ప్రతినిధి -రొయ్యల మేతల ధరల పెంపుపై ఆక్వారైతుల నిరసన.. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన ..: ఆక్వా మేతల కంపెనీలన్నీ సిండికే ట్గా మారడం వల్లనే ఆక్వారైతుల కు తీరని అన్యాయం చేసేలా మేత ల కంపెనీలు ధరలు పెంచేశాయని ఆక్వారైతు సంఘ నాయకుడు త్సవటపల్లి నాగభూషణం ఆరో పించారు. వరుస దెబ్బలతో సతమతవుతున్న ఆక్వారైతులు ఇప్పుడు ధరలు పెంచడంతో మరింత కుదేల య్యే పరిస్థితిలోకి వెళ్లారన్నారు. కాట్రేనికోన మండలం చెయ్యేరులో నాగభూషణం ఆధ్వర్యంలో ఆక్వా మేతల ధరలు పెంపును నిరసిస్తూ నిరసన చేపట్టారు. ఈసందర్భంగా నాగభూషణం మాట్లాడుతూ మేత ల కంపెనీలు తీసుకున్న నిర్ణయం తో కిలోకు రూ.8 భారం పడుతుం దని, దీని ప్రభావంతో ఎకరా విస్తీర్ణం లో ఆక్వాసాగుకు రూ.40 వేలు నుంచి రూ.50 వేలు మేరకు అదనపు భారం పడుతుందన్నారు. గతం లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన సుంకాల బాధ అంతలో నే ఇరాన్. ఇజ్రాయేల్, అమెరికా మధ్య యుద్ధం,ఆతరువాత డీజిల్ సంక్షోభంతో ఆక్వారంగం తీవ్రంగా నష్టపోయిందని, తాజాగా మేతలు ధరలు పెంచుతూ నిర్ణయం తీసు కోవడం వల్ల మరింత నష్టాలపాల య్యే పరిస్థితి తలెత్తిందన్నారు. ప్రస్తుతం ఆక్వా పరిశ్రమ వెంటిలేట ర్పై ఉందని, ప్రభుత్వం ఆదుకోకుం టే ఆక్వా పరిశ్రమ వరుస నష్టాల తో కుదేలవ్వక తప్పదన్నారు. ట్రంప్ సుంకమని 25 శాతం పెంచి తే ఏప్రిల్ నెలలో అమలు చేసి ఆగస్టు నెలలో ఇంప్లిమెంట్ చేశా రని, దీంతో 15 నుంచి 25 వేల కోట్లు నష్టపోయారని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే చెప్పార ని,కానీ నష్టపోయింది రైతులే కానీ ఎక్స్పోర్టర్ కాదన్నారు. రైతులు వరుసగా ఇబ్బందులు పడుతు న్నారని, యుద్ధం వంకతో తక్కువ ధరలకు కొనుగోలు చేశారని, ఆ తరువాత ఆయిల్ సంక్షోభం పేరు తో టన్నుకు రూ.10 వేలు లాగేశార న్నారు. ఇది పూర్తిగా ప్రభుత్వం యొక్కవైఫల్యం అన్నారు. ఇప్పడు ముడిసరుకుల ధరలు పెరిగాయని చెప్పి అన్ని కంపెనీలు అన్నీ మూ కుమ్మడిగా ధరలు పెంచాయని ఆవేదన వ్యక్తం చేశారు. మేతల ధరలను ప్రభుత్వం నియంత్రించ కుంటే రాబోయే రోజుల్లో అన్ని జిల్లాల ఆక్వారైతులను కలుపుకు ని కార్యచరణ ప్రకటిస్తామని నాగభూషణం హెచ్చరించారు. ఆక్వా బతకాలంటే సిండికేట్ వ్యవస్థ పోవాలంటూ. పెంచిన మేతల ధరలను వెంటనే తగ్గించా లంటూ నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో త్సవటపల్లి మణికుమార్, గుత్తుల ధర్మరాజు, నంద్యాల బాబి,కాయల బలరామ మూర్తి, సూదా రామవేంద్ర, బొక్కా హరి,కనకాల సతీష్, నంద్యాల శివ, నంద్యాల వేంకటేశ్వర రావు, అక్కల బాలకృష్ణ, గాలిదేవర దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper