ఘనంగా ప్రారంభమైన ‘శ్రీ మారమ్మ తల్లి’ క్రికెట్ టోర్నమెంట్

May 14, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా 14-05-26 నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి, ఎర్రచెరువు గ్రామంలో శ్రీమారమ్మ యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ మారమ్మ తల్లి క్రికెట్ టోర్నమెంట్‌ ను గురువారం సింగిల్ విండో అధ్యక్షులు పసుపులేటి ప్రవీణ్ కుమార్, టిఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణు గోపాల్ ఘనంగా ప్రారంభిం చారు.కార్య క్రమంలో భాగంగా అతిథులు టాస్ వేసి,బ్యాటింగ్ చేసి క్రీడలను లాంఛనంగా ప్రారం భించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. గెలుపోటముల కంటే క్రీడల్లో పాల్గొనడం ముఖ్య మని, ప్రతి ఆటగాడు క్రీడా స్ఫూర్తిని చాటాలనికోరారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి టోర్నమెంట్లు నిర్వహించడం వల్ల యువతలో ఐక్యత పెరగడమే కాకుండా,శారీరక దృఢత్వానికి తోడ్పడుతాయని పేర్కొన్నారు. క్రీడల్లో రాణించే ప్రతిభావంతు లైన యువతకు ఎల్లప్పుడూ తమ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.ఈ టోర్నమెంట్‌ లో మండలం లోని వివిధ ప్రాంతాల నుండి జట్లు తరలి వచ్చాయి. ప్రారంభ వేడుకలో స్థానిక నాయకులు, నిర్వాహ కులు మరియు పెద్ద సంఖ్యలో క్రికెట్ అభిమానులుపాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper