తెలంగాణ ప్రజానాట్యమండలి రాష్ట్ర నాలుగో4వ మహాసభలను జయప్రదం చేయండి

May 14, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ ఏప్రిల్ 14 2026 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ ) ఈరోజు ఎల్కతుర్తి మండల కేంద్రంలో తెలంగాణ ప్రజానాట్యమండలి రాష్ట్ర 4వ మహాసభలు జయప్రదం చేయాలని కోరుతూ గోడ పత్రిక ఆవిష్కరణ చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో వక్తలుCPI ఎలుక తుర్తి మండల కార్యదర్శి శనిగరపు రాజ్ కుమార్ జిల్లా కార్యవర్గ సభ్యులు ఊట్కూరు రాములు కర్రే లక్ష్మణ్ ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు గడ్డం రాజనర్స్ లు మాట్లాడుతూ 1943 లో కళా ప్రజల కోసం అనే ఆశయంతో బాలరాజ్ సహాని పృథ్వీరాజ్ కపూర్ ముల్కరాజ్ ఆనంద్. హరీష్ ఆధ్వర్యంలో బొంబాయిలో IPTA (ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్) స్థాపించబడినది ఇదే సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో IPTA కు అనుబంధంగా ప్రజానాట్యమండలి ఏర్పడింది ప్రజా సమస్యలను కళారూపాలుగా రూపొందించి ప్రజలలో చైతన్యం కలిగించడం గ్రామీణ ప్రజల జీవితాలకు ప్రతిబింబాలైన జానపద కలలను తీర్చిదిద్దడం తన ధ్యేయంగా పెట్టుకుంది ప్రజానాట్యమండలి ఆనాడు యుద్ధ జ్వాలల్లోకీడ్చిన హిట్లర్ పాసిజాన్ని నిరసిస్తూ పాటలు నాటికలు యక్షగానాల ద్వారా చైతన్యవంతం చేసింది ప్రజానాట్యమండలి నిజాం నిరంకుశ పాలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజల వీరోచిత పోరాటానికి నీడలా పనిచేసింది మాభూమి ముందడుగు నాటకాలు కష్టజీవి బుర్రకథ ఆ రోజుల్లో తెలంగాణ ప్రజలను ఉర్రూతలూగించి పోరాట దళాలను ఉరికింపజేశాయి ఆ కారణాన్నే1948 ఆనాటి పాలకుల నిషేధానికి గురైంది ప్రజానాట్యమండలి ఆనాడు ప్రజానాట్య మండలి వెలికి తీసిన మట్టిలో మాణిక్యాలే ప్రముఖ కళాకారులు డాక్టర్ రాజారావు తాతినేని ప్రకాశరావు చలపతిరావు అల్లు రామలింగయ్య మోహన్ దాస్ నాజర్ కొంగంటి సంపత్ కుమార్ మిక్కిలినేని మధుసూదన్ రావు జమున మొదలగు వారంతా కొన్ని సంవత్సరాల విరామం తర్వాత 1974 లో ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలిగా పూనం నిర్మాణం చేయబడింది ప్రజానాట్యమండలి ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రజల సమస్యలు ఇతివృత్తాలుగా కళారూపాలు తయారుచేసి ప్రజలను మేలుకొలుపు కార్యక్రమాలను నిర్వహిస్తుంది ప్రజానాట్యమండలి భూమి సమస్య ఇతివృత్తంగా భూమి బాగోతం నృత్య నాటిక కొన్ని వేల ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది రచనలు యుగే యుగే నాటిక కీర్తిశేషులు మాదాల రంగారావు టి కృష్ణ గార్ల ఆధ్వర్యంలో అందరూ బ్రతకాలి సాంఘిక నాటకం నాగభూషణం ఆధ్వర్యంలో అనేక పట్టణాల్లో ప్రదర్శించడం జరిగినది ప్రజల గాధలు బాధలు పాటలుగా రూపొందించి చక్కని బాణీలతో అన్ని సందర్భాలలో రాష్ట్రవ్యాప్తంగా పాడుచున్నారు ప్రజానాట్యమండలి నాయకులు బుర్రకథ పల్లె సుద్దులు డప్పులు కోలాటం మొదలగు జానపద కళారూపాలను జీవనం చేస్తుంది ప్రజానాట్యమండలి ఆధునిక కళారూపం వీధి నాటికను ఒక సాధనంగా వద్దకు తీసుకెళ్తుంది ప్రజానాట్యమండలి ప్రస్తుతం మన రాష్ట్రంలో అన్ని జిల్లాలలోనూ ప్రజానాట్యమండలి తన కార్యక్రమాలను నిర్వహిస్తున్నది పత్రిక ఆవిష్కరణ కార్యక్రమంలో సిపిఐ మండల సీనియర్ నాయకులు తండా మొండయ్య సిపిఐ గ్రామ కార్యదర్శి వేముల కృష్ణకర్ సిపిఐ నాయకులు బిల్కూరు తులసి రామ్ ఎర్ర ప్రకాష్ రాజం రాజు ఎండి రహీముద్దీన్ తదితరులు పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper