ePaper

తాళ్ళ రాంపూర్ సొసైటీ పీఐసీ అధ్యక్షుడిగా జీకే శ్రీనివాస్ రెడ్డి

May 9, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్, మే 09: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రంలోని తాళ్ళ రాంపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో హైకోర్టు ఆదేశాలు, జిల్లా సహకార అధికారి సూచనల మేరకు పాత పాలకవర్గానికి తిరిగి బాధ్యతలు అప్పగించారు. గతంలో సంఘ అధ్యక్షుడిగా ఎన్నికైన పెద్దకాపుల శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం సర్పంచ్‌గా కొనసాగుతున్న నేపథ్యంలో, ఉపాధ్యక్షుడిగా ఉన్న గడ్డం కొట్టాల శ్రీనివాస్ రెడ్డిని పర్సన్ ఇంచార్జీ కమిటీ (పీఐసీ) అధ్యక్షుడిగా నియమించారు.అదేవిధంగా పాలకవర్గ సభ్యులుగా సోమ దేవరెడ్డి, బడిగిరి సాయిరాం, బద్దం రవీందర్, కాటిపల్లి సుశీల, బొంత గంగాధర్, దేశవోయిన సంజీవ్, మద్దెల గంగులకు నియామక పత్రాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో దోంచందా సర్పంచ్ పెద్దకాపుల శ్రీనివాస్ రెడ్డి, సంఘ కార్యదర్శి ఎర్రాజీ గణేష్‌తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.