ఘనంగా నిర్వహించిన బొడ్రాల పండుగ హాజరైన మాజీ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి
జనం న్యూస్ : వనపర్తి డివిజన్ రీపోటర్ కటికల శివకుమార్ మే 9 2026 శనివారం పెబ్భైర్ అంగరంగ వైభవంగా తోమలపల్లి గ్రామంలో బొడ్రాళ్ళు మరియు ఆంజనేయ స్వామి విగ్ర ప్రాణ ప్రతిష్ట మరియు గడస్తంభం ప్రాణప్రతిష్ట జరుగుతున్నటువంటి కార్యక్రమానికి రాష్ట్ర మాజీ వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు పాల్గొనడం జరిగింది శుభసందర్భంగా సార్ మాట్లాడుతూ గ్రామంలో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని గ్రామ ప్రజలకు ఎల్లవేళలా ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉండాలని గుడిలో పూజలు నిర్వహించారు జైశ్రీరామ్ నిదానంతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరారు ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి గుడి కమిటీ మరియు సేవలందించిన యువకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు చాలా సంతోషంగా ఉందని కూడా అన్నారు జైశ్రీరామ్ జై శ్రీ ఆంజనేయ.