యువకులు సమాజ సేవలో పాల్గొనాలి. సూరపరెడ్డి

May 11, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ మే 10 ముమ్మిడివరం ప్రతినిధి అయినవిల్లి మండలం కే. జగన్నాధపురం గ్రామం పక్షవాత బారిన పడిన నూకపెయ్యి ఏడుకొండలు కష్టాలు, స్వామి వివేకానంద సభ్యులు గనిశెట్టి వెంకటేశ్వరరావు(బాబి మాస్టర్)ద్వారా తెలుసు కున్నారు సూరపురెడ్డి సురేష్, వానపల్లిపాలెం గ్రామానికి చెందిన నల్లా మణికంఠ గారి దంపతులు సహకారంతో నెలకి సరిపడా నిత్యవసర వస్తువులు ఈరోజు కూటమి ప్రభుత్వ నాయకుల చేతుల మీదగా అందించడం జరిగింది. దీనికి గాను అతని కుటుంబ సభ్యులు మణికంఠ వారి దంపతులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో నల్లా గణేష్,సలాది ఫణి,ఎర్రంశెట్టి కృష్ణ, యనమదల వెంకటరమణ,ఇసుకపట్ల దేవి గంగాభవాని మరియు స్థానిక మహిళలు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper