అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు అండగా నిలిచిన ఎమ్మెల్యే జి.ఎస్.ఆర్

May 27, 2026 | తెలంగాణ

జనం న్యూస్ మే 27 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని పెద్దకొడేపాక గ్రామంలో మంగళవారం జరిగిన అగ్ని ప్రమాదంలో అబ్బు జనార్ధన్ రెడ్డి, అబ్బు రాజిరెడ్డి, అబ్బు మాల్రెడ్డి కు చెందిన ఇళ్లు, వరి గడ్డి, వ్యవసాయ పనిముట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.విషయం తెలుసుకున్న భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు గ్రామానికి చేరుకొని బాధిత కుటుంబాలను పరామర్శించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి, అగ్ని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామస్తులు అధికారులను సూచించారు.అలాగే సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట తాహసిల్దార్ ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దుదిపాల బుచ్చిరెడ్డి పరకాల వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ మారెపల్లి బుజ్జన్న రవీందర్ స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు గ్రామ ప్రజలు తదితరులు ఉన్నారు….

🌐 Select Language:
📰 ePaper