అనుపల్లి వరప్రసాద్ సేవా స్ఫూర్తికి ప్రతిష్ఠాత్మక డాక్టరేట్ గుర్తింపు
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా సెప్టెంబర్ 9 సామాజిక సేవారంగంలో విశేష కృషి చేస్తున్న నందలూరు వాస్తవ్యులు, పుల్లయ్య తనయుడు అనుపల్లి వరప్రసాద్ కు ప్రతిష్ఠాత్మక UHAC విజనరీ డాక్టరేట్ హానర్ లభించింది. సామాజిక సేవ,నాయకత్వం, ప్రజా సంక్షేమం పట్ల ఆయన చూపుతున్న నిబద్ధతను గుర్తిస్తూ యూనివర్సల్ హానరరీ అవార్డ్ కౌన్సిల్ (UHAC) ఈ గౌరవాన్ని అందించింది.2026 ఆగస్టు 25న ఈ డాక్టరేట్ ప్రదానం చేసినట్లు ధ్రువ పత్రంలో పేర్కొన్నారు. వరప్రసాద్‌ను UHAC జాతీయ సభ్యుడిగా, ఆంధ్రప్రదేశ్ సామా జిక సేవా రంగానికి ప్రాతి నిధ్యం వహించే సభ్యుడిగా గుర్తించింది. ఈ సందర్భంగా వర ప్రసాద్ మాట్లాడుతూ ఈ గౌరవం తనపై మరింత బాధ్యతను పెంచిందని
భవిష్యత్తులో సామాజిక సేవా కార్య క్రమాలను మరింత విస్తృతంగా కొనసాగిస్తానని తెలిపారు.యువతలో సేవా భావం,సామాజిక బాధ్యత పెంపొందించేందుకు కృషి చేస్తానని చెప్పారు