అభయ జ్యోతి పాఠశాలలో ఫిజియోథెరపీ, క్యాన్సర్ అవగాహన కార్యక్రమం
జనం న్యూస్:9 సెప్టెంబర్ బుధవారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై. రమేష్ ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ సిద్దిపేట్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో, పల్స్ న్యూరో హాస్పిటల్ సహకారంతో అభయ జ్యోతి మానసిక దివ్యాంగుల పాఠశాలలో బుధవారం ఫిజియోథెరపీ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించడంతో పాటు క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో భాగంగా సుమారు 25 మంది విద్యార్థులకు ఫిజియోథెరపీ సేవలు అందించారు.ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు లగిశెట్టి నరసింహులు మాట్లాడుతూ “ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం బాగుంటేనే మనమంతా బాగుంటాం. ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం సందర్భంగా మానసిక దివ్యాంగుల విద్యార్థులకు ఫిజియోథెరపీ సేవలు అందించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం” అని తెలిపారు.కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ట్రెజరర్ బాసంకారి శ్రీనివాస్, పల్స్ న్యూరో హాస్పిటల్ డాక్టర్ హిమశ్రీ, ఫిజియోథెరపీ నిపుణులు, క్యాన్సర్ అవగాహన కార్యక్రమ బృందం, అభయ జ్యోతి పాఠశాల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.