ప్రతిభావంతులైన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందజేసిన కమిడి నీలయ్య ఫౌండేషన్

September 9, 2026 | ఆంధ్రప్రదేశ్

జనం న్యూస్ సెప్టెంబర్ 8 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం పల్లంకుర్రు పంచాయతీ పరిధిలోగల సాపేవారిపల్లి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ప్రధానోపాధ్యాయురాలు ఐ.సుధ అధ్యక్షతన కమిడి నీలయ్య ఫౌండేషన్ వారు 2025-26 విద్యా సంవత్సరంలో పదవ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మందపాటి ప్రసన్నలక్ష్మి, నాగళ్ళ సాయి ప్రసన్నలక్ష్మి మరియు నాగళ్ళ కాంచనలకు మొదటి, ద్వితీయ, తృతీయ స్థానాలుగా 15,000, 10,000 మరియు 5,000 రూపాయలను నగదు ప్రోత్సాహక బహుమతులుగా అందివ్వడంతో పాటు ఫౌండేషన్ తరపున ప్రశంసా పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు కమిడి మాత వరప్రసాద్ మాట్లాడుతూ విద్యకు పేదరికం అడ్డం కాకూడదనే కారణంగా గత దశాబ్ద కాలం నుండి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, దానిలో భాగంగా విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రతిభావంతులకు ప్రోత్సాహక బహుమతులు అందిస్తున్నామని, అదే విధంగా కొన్ని పాఠశాలలకు పుస్తకాలు అందిస్తున్నామని తెలియజేశారు. ప్రధానోపాధ్యాయురాలు ఐ.సుధ మాట్లాడుతూ ఫౌండేషన్ చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని, అదేవిధంగా తమ పాఠశాలకు 25,000 విలువగల CPUను అందించారని, గతం నుండి కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నారని ఫౌండేషన్ కుటుంబ సభ్యులను కొనియాడారు. పేరెంట్స్ కమిటీ చైర్మన్ కాశి శ్రీనుబాబు మాట్లాడుతూ ఫౌండేషన్ వారు చేస్తున్న సేవా కార్యక్రమాలను విశేషంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ కమిడి సంతనుడు, సెక్రటరీ జ్ఞాన సుందరి, సభ్యులు తిరుకోటి భారతి, కమిడి సన్నీ, జగడం శ్రీనుబాబు, ఉపాధ్యాయులు ఎన్.ఎస్ సత్యనారాయణ, గెడ్డం ప్రదీప్, ఎం.శ్రీనివాసరాజు, వై.కృష్ణ, కె.బేబీ, జ్యోతి, సుజని, కమిడి శ్రీనివాసరావు, విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper