కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు.. చట్టపరమైన చర్యలు తీసుకోవాలి
ఏర్గట్ల ఎస్సై కి బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు
జనం న్యూస్, సెప్టెంబర్ 09: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్లో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు ఏనుగందుల రాజపూర్ణానందం ఆధ్వర్యంలో బుధవారం ఎస్సై పడాల రాజేశ్వర్ కు ఫిర్యాదు పత్రం అందజేశారు. షాద్నగర్ ఎమ్మెల్యే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు, ఆయన మరణాన్ని కోరుకుంటున్నట్లు బహిరంగంగా మాట్లాడటం తీవ్ర అభ్యంతరకరమని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధి హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.ఇలాంటి వ్యాఖ్యల వల్ల ప్రజల్లో ఉద్రిక్తతలు ఏర్పడి శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉన్నందున, సంబంధిత వ్యక్తిపై విచారణ జరిపి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్ఐని కోరారు. అదేవిధంగా కేసీఆర్ నివాసం వద్ద భద్రతను మరింత పెంచాలని పోలీసులను విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఏర్గట్లమండల బీఆర్ఎస్ నాయకులు, స్థానిక సర్పంచ్ కొలిప్యాక ఉపేందర్ రెడ్డి, బర్మా నర్సయ్య కార్యకర్తలు పాల్గొన్నారు.