అన్నపూర్ణాదేవి ఆశీస్సులతో,యోగ విజ్ఞాన కేంద్రం వ్యవస్థాపకులు జగన్ గురూజీ ఆధ్వర్యంలో 150 మందికి పైగా మహిళలతో ఘనంగా వరలక్ష్మీ వ్రతం

September 11, 2026 | తెలంగాణ

జనం న్యూస్ సెప్టెంబర్ 11 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి గురుదేవుల ఆహ్వానం మేరకు కార్యక్రమంలో పాల్గొన్న కూకట్‌పల్లి సీనియర్ నాయకులు గొట్టుముక్కల దేశాల్ యువ నాయకులు గాదె శివ.అన్నపూర్ణాదేవి అమ్మవారి ఉపాసకులు, యోగ విజ్ఞాన కేంద్రం వ్యవస్థాపకులు జగన్ గురూజీ ఆధ్వర్యంలో శ్రావణ మాసం చివరి శుక్రవారం సందర్భంగా లోధా రోడ్‌లోని గురుస్థానంలో ఘనంగా వరలక్ష్మీ వ్రతం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 150 మందికి పైగా మహిళలు భక్తిశ్రద్ధలతో పాల్గొని ప్రత్యేక కుంకుమార్చన నిర్వహించారు.1990 నుంచి ఆధ్యాత్మిక, ఆరోగ్య సేవలుకూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు రోడ్ నంబర్–1లో 1990 సంవత్సరం నుంచి యోగ విజ్ఞాన కేంద్రం ద్వారా జగన్ గురూజీ ఆధ్యాత్మిక, ఆరోగ్య సేవలను అందిస్తున్నారు. ప్రస్తుతం లోధా రోడ్‌లోని గురుస్థానంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు.మహదేవపురంలో అన్నపూర్ణాదేవి ఆలయ ప్రతిష్ఠజగన్ గురూజీ సంకల్పంతో సుమారు పదేళ్ల క్రితం మహదేవపురంలో అన్నపూర్ణాదేవి ఆలయాన్ని నిర్మించి ప్రతిష్ఠించారు. ఆలయంలోని ఉత్సవ మూర్తి ప్రస్తుతం గురుస్థానంలో ఉండగా, అమ్మవారి అనుగ్రహం లోధా రోడ్ పరిసర ప్రాంతాల భక్తులకు కూడా సంపూర్ణంగా లభించాలనే సంకల్పంతో వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహించారు.
150 మందికి పైగా మహిళలతో ఘనంగా కుంకుమార్చనతొలుత 108 మంది సుమంగళులతో వరలక్ష్మీ వ్రతం నిర్వహించాల ని సంకల్పించగా, భక్తుల విశేష స్పందనతో 150 మందికి పైగా మహిళలు పాల్గొన్నారు. శ్రీ వరలక్ష్మీ అమ్మవారికి బంగారు పుష్పాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి, మహిళలు భక్తిశ్రద్ధలతో కుంకుమార్చన చేశారు.జగన్ గురూజీ అందించిన పసుపు, కుంకుమతో పాటు అమ్మవారికి సమర్పించిన వస్త్రాలను భక్తులు స్వీకరించారు. అనంతరం మహిళలకు చీరలను అందజేశారు. అలాగే జీహెచ్‌ఎంసీ కార్మికులకు కూడా వస్త్రాలను దానం చేశారు. కార్యక్రమం అనంతరం అన్నపూర్ణాదేవి ప్రసాదంగా అన్నదానం నిర్వహించారు.జగన్ గురూజీ ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమంలో దేశాల్ మిత్రమండలి వ్యవస్థాపకులు, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గొట్టుముక్కల దేశాల్ కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు గాదె శివ పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. అసోసియేషన్ సభ్యులు, భక్తులు, శిష్యులు,ఈ కార్యక్రమంలో ప్రసాద్ శ్రీధర్ రెడ్డి దేశాల్ మిత్రమండలి సభ్యులు,మానవసేవే మాధవసేవ వ్యవస్థాపకులు లక్ష్మీనారాయణ, వాసిరెడ్డి సుధీర్, రంగమోహన్ , సత్యా, వరుణ్, రవి, సూరి బాబు, ప్రెసిడెంట్స్ సంధ్య రాణి,కల్పన రజని జయ రాజేశ్వరి అపర్ణ అరుణ విజయ, మహిళలు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న జగన్ గురూజీ సేవలు అభినందనీయం: గాదె శివఈ సందర్భంగా కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు గాదె శివ మాట్లాడుతూ, జగన్ గురూజీ ఆధ్వర్యంలో శ్రీ వరలక్ష్మీ అమ్మవారికి బంగారు పుష్పాలతో నిర్వహించిన వరలక్ష్మీ వ్రతంలో 150 మందికి పైగా మహిళలు భక్తిశ్రద్ధలతో పాల్గొనడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు.మహిళలు భక్తిపూర్వకంగా కుంకుమార్చనలో పాల్గొనడంతో పాటు, వారికి చీరలు, జీహెచ్‌ఎంసీ కార్మికులకు వస్త్రాలను దానం చేయడం అభినందనీయమన్నారు. అక్కాచెల్లెళ్లతో కలిసి ఇలాంటి పవిత్రమైన ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనడం తనకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.ఆధ్యాత్మికతతో పాటు సేవా కార్యక్రమాలు కొనసాగించడం అభినందనీయం ఆధ్యాత్మికతతో పాటు సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తూ, ఇతరులను కూడా ఇలాంటి కార్యక్రమాల వైపు ప్రోత్సహిస్తున్న జగన్ గురూజీ వంటి ఆధ్యాత్మిక సేవాభావం కలిగిన వ్యక్తులు కూకట్‌పల్లి నియోజకవర్గంలో, ముఖ్యంగా కేపీహెచ్‌బీ ప్రాంతంలో ఉండటం మన అదృష్టమని గాదె శివ అన్నారు.అన్నపూర్ణాదేవి కృపతో ప్రతి కుటుంబానికి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సుఖసంతోషాలు కలగాలని, కూకట్‌పల్లి ప్రాంతం సుభిక్షంగా ఉండాలని జగన్ గురూజీ ఆకాంక్షించారు.

🌐 Select Language:
📰 ePaper