తెలంగాణ ఉద్యమకారుల జర్నలిస్టుల ఫోరం నల్లగొండ జిల్లా కన్వీనర్‌గా – రమావత్ దినేష్ నాయక్

September 11, 2026 | తెలంగాణ

జనం న్యూస్-సెప్టెంబర్ 11- నాగార్జునసాగర్ టౌన్- తెలంగాణ ఉద్యమకారుల జర్నలిస్టుల ఫోరం నల్లగొండ జిల్లా కన్వీనర్‌గా రమావత్ దినేష్ నాయక్ నియమితులయ్యారు.దినేష్ నాయక్‌ను జిల్లా కన్వీనర్‌గా నియమిస్తూ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు కుక్కముడి శ్రీనివాస్ ఉత్తర్వులు జారీ చేశారు.నియామక పత్రాన్ని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణ బ్రహ్మానందరెడ్డి దినేష్ నాయక్‌కు అందజేశారు.ఈ సందర్భంగా దినేష్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానన్నారు.ఉద్యమకారులకు గౌరవం, గుర్తింపు, సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వంపై పోరాటం చేస్తానని స్పష్టం చేశారు.జిల్లాలోని తెలంగాణ ఉద్యమకారులను సమన్వయం చేసుకుని వారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తనపై నమ్మకంతో కీలక బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర నాయకత్వానికి రమావత్ దినేష్ నాయక్ కృతజ్ఞతలు తెలిపారు.

🌐 Select Language:
📰 ePaper