గొల్లపల్లి గ్రామంలో ఉర్దూ పాఠశాల నూతన భవనం అరవపల్లె సీసీరోడ్లను. ప్రారంభించిన ఎంపీ మేడ రఘునాథ్ రెడ్డి.

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా సెప్టెంబర్ 11. నందలూరుమండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని గొల్లపల్లి గ్రామంలో ఉర్దూ పాఠశాల అభివృద్ధి పనులతో పాటు అరవపల్లి ZP గ్రౌండ్ వరకు పలు సీసీ రోడ్డు పనులు రాజ్యసభ సభ్యులు, ఎంపీ మేడా రఘునాథ రెడ్డి ఎం పి ల్యాండ్స్ నిధులతో పూర్త యిన సందర్భంగా మండల కో ఆప్షన్ కలీమ్ ఉల్లా ఖాన్ ఆహ్వానం మేరకు శుక్రవారం ఉదయం రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథ్ రెడ్డి పాల్గొన్నారు.ఈ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు, తిరుపతి పార్లమెంట్ పరిధి పరిశీలకులు, ఎంపీ మేడా రఘునాథ రెడ్డి రాజంపేట శాసన సభ్యులు,ఆకేపాటి,అమర్‌నాథ్ రెడ్డి, నందలూరు మండల ఎంపీపీ మేడా విజయ భాస్కర్ రెడ్డి,పాల్గొన్నారు.ఈ కార్య క్రమంలో వైఎస్సార్‌సీపీ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయ కులు,కార్యకర్తలు,అభిమానులు, గొల్లపల్లి అరవపల్లి గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఎంపీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.