ఇంటిని కూల్చడం అనాగరిక చర్య

జనం న్యూస్ 11 సెప్టెంబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ఘటనపై పోలీసు అధికారులు త్వరితగతిన విచారణ చేపట్టాలి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి బీఎస్పీ జిల్లా అధ్యక్షులు మణి కుమార్ జోగులాంబ :(గద్వాల )::- దళితుల ఇంటిని కూల్చడం అనాగరిక చర్య అని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మణికుమార్ అన్నారు. పార్టీ శ్రేణులతో కలిసి శుక్రవారం ఆయన గద్వాల మండలం రేపల్లెలో కూల్చిన దళితుల ఇంటిని పరిశీలించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, సమస్యను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వ్యక్తిగత సమస్యలను దృష్టిలో పెట్టుకుని దళితుల ఇంటిపై దాడి చేసి అత్యాధునిక వాహనం సహాయంతో ఇంటిని కూల్చివేయడం హేయమైన చర్య అని అన్నారు. ఘటనపై పోలీసు అధికారులు త్వరితగతిన విచారణ చేపట్టాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఇంటి కూల్చిన నిందితులపై కఠిన శిక్షను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి నష్టపరిహారంతో పాటు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వము ఇందిరమ్మ ఇల్లును మంజూరు చేసి.. నిర్మించేటట్లు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాని డిమాండ్ చేశారు.అదేవిధంగా కుటుంబంకు రక్షణ కల్పించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కోశాధికారి శాంతిరాజు, జిల్లా మాజీ అధ్యక్షుడు ఆకేపోగు రాంబాబు, సెక్టార్ కమిటీ కార్యదర్శి బోయ మధు ఇతరులు పాల్గొన్నారు.