ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేసే వరకు రేవంత్ రెడ్డి సర్కార్ ను వదిలిపెట్టం

జనం న్యూస్ 11 సెప్టెంబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు మరియు జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య అరెస్ట్ పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలనీ అదేవిధంగా జీవో నెంబర్ 97 ను రద్దు చేయాలి అని డిమాండ్ చేస్తూ బషీర్ బాగ్ చౌరస్తా నుండి గన్ పార్క్ వరకు శాంతియుత ర్యాలీ చేపట్టిన బిఆర్ఎస్వి నాయకులను మరియు రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఉపఅధ్యక్షులు తుంగ బాలు గార్లతో తో పాటు రాష్ట్ర నాయకులు, జిల్లా కోఆర్డినేటర్ లను అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలింపు.ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు కురువ పల్లయ్య మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల కాకపోవడంతో వేలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు గడిచిన 33 నెలలుగా తెలంగాణలో విద్యారంగంన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం
ఒకప్పుడు దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన తెలంగాణ విద్యావ్యవస్థ నేడు దిగజారిపోయిన స్థితికి చేరడం అత్యంత బాధాకరం రేవంత్ రెడ్డి తన ప్రసంగాల్లో “భవిష్యత్ తెలంగాణ అంటే విద్యార్థులు, విద్యావ్యవస్థ అని చెబుతున్నప్పటికీ, ఆచరణలో మాత్రం శూన్యం ఇప్పటివరకు ఈ రాష్ట్రంలో ఉన్న 15 లక్షల మంది ప్రైవేటు కాలేజీ లలో చదివే విద్యార్థులకు 12,000 వేల కోట్ల పైగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయలేదు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయలేదు. .జాబ్ క్యాలెండర్ చేయలేదు 4000 నిరుద్యోగ భృతి ఇవ్వలేదు విద్యార్థులకు స్కూటీలు ఇవ్వలేదు కచ్చితంగా భవిష్యత్తులో బి ఆర్ యస్ వి ఆధ్వర్యంలో విద్యార్థులకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు పోరాటంను ఉదృతం చేస్తామని హెచ్చరించారు.