నాణ్యతలేని కరెంటు విడుదలతో మోటార్లు కాలిపోతున్నాయి.

జనం న్యూస్ 11 సెప్టెంబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగుళాంబ గద్వాల జిల్లా విద్యుత్ సరఫరా లోపాలతో మోటర్లు కాలిపోయి రైతులకు అదనపు భారం పడుతుంది గద్వాల నియోజకవర్గంలో రైతులకు తీవ్ర విద్యుత్ సమస్యలు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి.ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అమలు చేయాలి డికె.స్నిగ్ద రెడ్డి ఈరోజు దరూర్ మండలం కేంద్రంలో 33/11కెవి సబ్ స్టేషన్ దగ్గర వ్యవసాయ విద్యుత్ కోతలకు నిరసనగా రోడ్డు పై మండల రైతులు ధర్నా కార్యక్రమం చేపట్టారు ఈ ధర్నా కార్యక్రమంకు బిజెపి పార్టీ జిల్లా యువ నాయకురాలు డికె. స్నిగ్ద రెడ్డి బిజెపి నాయకులు రైతులకు మద్దతు తెలుపుతూ ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా యువ నాయకురాలు డికె. స్నిగ్ద రెడ్డి గారు మాట్లాడుతూ గద్వాల నియోజకవర్గంలో రైతులు ప్రస్తుతం తీవ్రమైన విద్యుత్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు వ్యవసాయ బోర్లకు సరిపడా నాణ్యమైన విద్యుత్ అందకపోవడం వల్ల పంటలకు సకాలంలో నీరు అందడం లేదు. ప్రభుత్వం ప్రకటించిన మేరకు విద్యుత్ సరఫరా జరగకపోవడం, తక్కువ వోల్టేజ్ తరచూ విద్యుత్ అంతరాయాలు కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్లను సకాలంలో మార్చకపోవడం వంటి కారణాలతో రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారని అన్నారు వ్యవసాయానికి అవసరమైన సమయంలో విద్యుత్ అందక రైతులు రాత్రి వేళల్లో పొలాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో వారి ప్రాణాలకు కూడా ముప్పు ఏర్పడుతోంది. మరోవైపు, విద్యుత్ సరఫరాలో లోపాల కారణంగా మోటార్లు దెబ్బతిని రైతులపై అదనపు ఆర్థిక భారం పడుతోందని అన్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు 24 గంటలు ప్రకటించిన 12 గంటలు కూడా ఇవ్వడం లేదని అన్నారు..తక్కువ వోల్టేజ్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడంతో పాటు, కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్లను అత్యవసరంగా మార్చాలని విద్యుత్ సరఫరాలో ఏర్పడుతున్న అంతరాయాలను నివారించి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్యవసాయ విద్యుత్ అందించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని అన్నారు యస్ ఇ అబ్దుల్ కరీం డి ఇ రవి ప్రసాద్ 2రోజులు సమయం ఇవ్వాలని ఉన్నత అధికారులతో మాట్లాడుతామని కోరడం తో డికె. స్నిగ్ద రెడ్డి హామీ తో రైతులు ధర్నా కార్యక్రమం విరమించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామచంద్ర రెడ్డి రాష్ట్ర కౌన్సిల్ మేంబర్ బండల వెంకట రాములు అక్కల రమాదేవి జిల్లా కోశాధికారి మిర్జాపురం రామచంద్ర రెడ్డి,బిజెవైఎం జిల్లా అధ్యక్షుడు బాబుల్ రెడ్డి కిసాన్ మోర్చా అధ్యక్షుడు దరూర్ కిష్టన్న ఓబీసీ మోర్చా అధ్యక్షుడు దాస్ జిల్లా ఎస్సి మోర్చా ఆంజనేయులు,మండల అధ్యక్షుడు తిమ్మా రెడ్డి తిరుపతి రెడ్డి,శ్రీపాద రెడ్డి, శ్రీనివాసులు బిజెపి సీనియర్ నాయకులు సంజీవ్ భరద్వాజ్, నర్సన్ దొడ్డి క్రిష్ణ రెడ్డి మిర్జాపురం వెంకటేశ్వర రెడ్డి రజక నరసింహులు ,చింత రేవుల రాజేష్ అయ్యా, హన్మంతరాయ శేఖర్ రెడ్డి డాక్టర్ లక్మన్న రామి రెడ్డి అనిల్ దామ నాగరాజు సంజీవ రెడ్డి,యువరాజ్ సద్దల కృష్ణ కౌన్సిలర్ శాలన్న,దరూర్ మండల నాయకులు తదితరులు హాజరయ్యారు.