
జనం న్యూస్ జులై 21 2026(ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ )ఎల్కతుర్తి మండల కేంద్రంలో నిర్వహించిన ప్రెస్మీట్లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముప్పు శ్రీనివాస్ మాట్లాడుతూ, కాలేశ్వరం, కరెంట్, నిరుద్యోగం అంశాలపై బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని విమర్శించారు. పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి, కాలేశ్వరం ప్రాజెక్టులో అవినీతితో ప్రజాధనాన్ని వృథా చేసిందని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆరోపణలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నాయని ఎద్దేవా చేశారు.పీసీసీ సభ్యులు బొమ్మనపల్లి అశోక్ రెడ్డి మాట్లాడుతూ, రైతులకు ఉచిత విద్యుత్ అందించిన ఘనత కాంగ్రెస్‌కేనని, ప్రస్తుతం కూడా రైతులకు నిరంతర విద్యుత్‌తో పాటు గృహ జ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు.నిరుద్యోగ యువతను బీఆర్ఎస్ పదేళ్లపాటు నిరాశపరిచిందని, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పారదర్శకంగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తూ యువతకు ఉపాధి కల్పిస్తోందని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, బీఆర్ఎస్ అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మరని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముప్పు శ్రీనివాస్, అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.