ఎస్టీ హాస్టళ్లలో బాలురకు జోరుగా అడ్మిషన్లు ప్రారంభం

June 27, 2026 | తెలంగాణ

జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్. బి వీరేశం జూన్ 27. 06. 2026 జహీరాబాద్ నియోజకవర్గంలోని ఎస్టీ బాలుర హాస్టళ్లలో 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత వసతి, భోజనం, విద్యా సౌకర్యాలను పొందేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. అర్హత కలిగిన ఎస్టీ విద్యార్థులు అవసరమైన ధ్రువపత్రాలతో సంబంధిత హాస్టల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. అడ్మిషన్ల కోసం పెద్ద సంఖ్యలో విద్యార్థులు, తల్లిదండ్రులు హాస్టళ్లను సందర్శిస్తూ వివరాలు తెలుసుకుంటున్నారు. సీట్లు పరిమితంగా ఉన్నందున అర్హులైన విద్యార్థులు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు కోరారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించాలని సూచించారు. అధికారులు అడ్మిషన్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తూ విద్యార్థులకు అవసరమైన మార్గదర్శకాలను అందిస్తున్నారు

🌐 Select Language:
📰 ePaper