ఏర్గట్లలో ఘనంగా పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలు
ఏర్గట్ల, ఆగస్టు 2 (జనం న్యూస్): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు శ్రీ పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఏర్గట్ల మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కేకు ను ఒకరినొకరు తినిపించుకున్నారు, అనంతరం స్వీట్లు పంచిపెట్టి, టపాకాయలు పేల్చి సంబరాలు నిర్వహించారు. అనంతరం ప్రజలకు పండ్లు పంపిణీ చేశారు. సుదర్శన్ రెడ్డి ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధిస్తూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో ఏర్గట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శివన్నోల్ల శివకుమార్, మండలంలోని వివిధ గ్రామాల కాంగ్రెస్ సర్పంచులు, ఉపసర్పంచులు, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కేఎంసీ డైరెక్టర్లు, మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యవర్గ సభ్యులు, కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.