జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సమస్యల పైన గళం ఎత్తని సురేష్ షెట్కర్
కేంద్ర మంత్రులను కలవండి నిధులను తీసుకురండి జహీరాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి
జనం న్యూస్ 02-08-2026 జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు (MP) సురేష్ కుమార్ షెట్కర్ నియోజకవర్గ సమస్యల పైన గళం ఎత్తకుండా మౌనంగా ఉన్నారనీ ఈ ప్రాంత ప్రజలు అభిప్రాయా పడుతున్నారు మరియు ఆయన రాజకీయ శైలిపై స్థానికంగా, రాజకీయ వర్గాల్లో పలు విభిన్న కోణాలు ప్రచారంలో ఉన్నాయి. అయితే, అధికారిక నివేదికలు మరియు ప్రజా ప్రతినిధుల ట్రాక్ రికార్డు ప్రకారం ఆయన పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వానికి తన పార్లమెంట్ నియోజకవర్గ సమస్యలపై ప్రశ్నించడం లేదని జహీరాబాద్ బుల్లెట్ ట్రైన్ విషయంలో ఎందుకు మౌనంగా ఉంటున్నారని కేంద్రం నుంచి రావాల్సిన నిధుల పైన ఎందుకు మౌనంగా ఉంటున్నారని జహీరాబాద్ పార్లమెంట్ ప్రజలు ఎంపీ మౌనాన్ని ప్రశ్నిస్తున్నారు.ఇక మౌనాన్ని వీడండి జహీరాబాద్ ప్రాంతానికి రావాల్సిన నిధులను తీసుకురండి రహదారి విస్తరణకు నిధులు తీసుకురండి మీరు ప్రస్తుత ఎంపీగా కొనసాగుతున్న అది మీ బాధ్యత ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఎందుకు మీ మౌనం ఈ ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా పనిచేయండి జహీరాబాద్ నారాయణఖేడ్ ఆందోల్ కామారెడ్డి ఎల్లారెడ్డి నియోజకవర్గంలో అనేక సమస్యలున్నప్పకి మీరు మౌనంగా ఉండడం సరికాదు జహీరాబాద్ నియోజకవర్గంలో నిమ్స్ కారడార్ ఇండస్ట్రియల్ కు సంబంధించిన రహదారులకు నిధులు తీసుకురండి జహీరాబాద్ పట్టణంలో అభివృద్ధికి తోడ్పడండి