కాలం మారినా .. చెదరని బంధమే స్నేహం

August 2, 2026 | తెలంగాణ

బాల్య మిత్రులు, కూటమి నాయకులతో మంత్రి వాసంశెట్టి సుభాష్ ఫ్రెండ్షిప్ డే వేడుకలు


జనం న్యూస్ ఆగస్టు 2 ముమ్మిడివరం ప్రతినిధి( గ్రంధి నానాజీ) “స్నేహానికన్నా మిన్న లోకాన లేదురా… దోస్త్ మేరా దోస్త్!” అనే భావనకు అద్దం పట్టేలా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో రామచంద్రపురంలో ఫ్రెండ్ షిప్ డే వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. రాజకీయ హోదాలు, అధికార బాధ్యతలు ఎంత ఎత్తుకు తీసుకెళ్లినా… బాల్య స్నేహాన్ని మాత్రం హృదయంలో పదిలంగా ఉంచుకున్న మంత్రి సుభాష్ తన మిత్రులతో కలిసి ఆప్యాయంగా వేడుకల్లో పాల్గొని అందరి హృదయాలను గెలుచుకున్నారు.డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా టీడీపీ అధ్యక్షులు గుత్తుల సాయి, జిల్లా ప్రధాన కార్యదర్శి, మంత్రి సుభాష్ బాల్య మిత్రుడు గంధం పల్లంరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో మంత్రి సుభాష్ కేక్ కట్ చేసి తన స్నేహితులకు ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఎన్డీఏ కూటమి నాయకులు, మహిళలు, యువత, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై మంత్రికి, ఆయన మిత్రులకు అభినందనలు తెలియజేశారు.ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ… “రక్తసంబంధాలను దేవుడు ప్రసాదిస్తాడు… కానీ నిజమైన మిత్రులను మనమే సంపాదించుకుంటాం. జీవితంలో సుఖదుఃఖాలకు తోడుగా నిలిచే నిజమైన స్నేహితుడు ఉంటే అదే గొప్ప సంపద. హోదాలు మారినా… కాలం మారినా… చెదరని బంధమే స్నేహం” అని అన్నారు.అలాగే “స్నేహం అంటే కేవలం ఒక రోజు శుభాకాంక్షలు చెప్పుకోవడం కాదు… జీవితాంతం ఒకరికొకరు అండగా నిలబడే నమ్మకం. కష్టంలో భుజం అందించేవాడే నిజమైన మిత్రుడు. స్నేహం ఉన్న చోట స్వార్థానికి స్థానం ఉండదు… ప్రేమ, విశ్వాసం, ఆప్యాయత మాత్రమే ఉంటాయి” అని పేర్కొన్నారు.వేడుకల సందర్భంగా స్థానిక మూడో వార్డులో “హ్యాపీ ఫ్రెండ్షిప్ డే”, “దోస్త్ మేరా దోస్త్” నినాదాలతో మార్మోగింది. బాల్య స్నేహితులతో మంత్రి సుభాష్ పంచుకున్న ఆత్మీయ క్షణాలు అందరినీ ఆకట్టుకున్నాయి. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మంత్రితో కలిసి కేక్ కట్ చేసి స్నేహబంధాన్ని మరింత ఘనంగా చాటిచెప్పారు.అలాగే రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి మంచి స్నేహంతో కొనసాగుతూ ఆంధ్రాను సువర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లు కృషి చేస్తున్నారని ప్రశంసించారు.

🌐 Select Language:
📰 ePaper