ఓటర్ల సమగ్ర సర్వేకు కార్యకర్తలు సహకరించాలి- రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి సాలగ్రమ లక్ష్మి ప్రసన్న
జనం న్యూస్ జూన్ 15 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) స్పెషల్ ఇంటన్సివ్ రివిజన్ ఎస్ ఐ ఆర్ డా. బిఆర్ అంబేద్కర్ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కార్యశాల కొత్తపేట ఆర్యవైశ్య కల్యాణమండపం లో కొత్తపేట నియోజకవర్గం (sir ) కన్వీనర్ పాలూరి సత్యానందం అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులు గా రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి సాలగ్రమ లక్ష్మి ప్రసన్న, జిల్లా బీజేపీ అధ్యక్షులు అడబాల సత్యనారాయణ పాల్గొన్నారు. లక్ష్మి ప్రసన్న మాట్లాడుతూ
ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (SIR-2026) కార్యక్రమాన్ని విజయ వంతం చేయడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పూర్తి స్థాయిలో సహకరించాలని పిలుపునిచ్చారు.భారత ఎన్నికల సంఘం చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా ఓటరు జాబితాలను మరింత ఖచ్చితంగా, పారదర్శకంగా, తప్పులు లేకుండా రూపొందించడమే లక్ష్యమని తెలిపారు. అర్హులైన ప్రతి పౌరుడు ఓటరుగా నమోదు కావడంతో పాటు, మరణించినవారు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు మారినవారు, డూప్లికేట్ నమోదులు వంటి లోపాలను గుర్తించి సరిదిద్దడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.BLA-2లు బూత్ లెవల్ అధికారులతో (BLOలు) సమన్వయంగా పనిచేస్తూ ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను ధృవీకరించాలని సూచించారు. కొత్తగా 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యువతను గుర్తించి ఓటర్లుగా నమోదు చేయడం, ఓటరు జాబితాలోని లోపాలను సరిచేయడంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని లక్ష్మి ప్రసన్న కోరారు.జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ మాట్లాడుతూ, ప్రతి ఓటరికి ఎన్యూమరేషన్ ఫారమ్ అందజేసి వాటిని సక్రమంగా పూర్తి చేయించి BLOలకు అందేలా చూడాలని అన్నారు. ఎన్నికల సంఘం ఈసారి డిజిటల్ మ్యాపింగ్, డేటా విశ్లేషణ, డూప్లికేట్ గుర్తింపు వంటి ఆధునిక సాంకేతిక విధానాలను వినియోగిస్తోందని, కార్యకర్తలు రాజకీయ పక్షపాతం లేకుండా ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పనిచేయాలని సూచించారు.BLA-2ల బాధ్యతలు, ఓటరు నమోదు ప్రక్రియ, ఫారమ్‌ల సేకరణ, ప్రజల్లో అవగాహన కల్పించడం వంటి అంశాలపై వివరించారు. ఈ కార్యక్రమం లో జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి చీకురుమల్లి శ్రీనివాసరావు, sc మోర్చా అధ్యక్షులు ఫోనుగుపాటి శ్రీనివాస్, నియోజకవర్గం త్రిమన్ కమిటీ సభ్యులు కోటిపల్లి దామోదర్, నాగిరెడ్డి స్వామి, గుడాల రాంబాబు, ఆత్రేయపురం మండల అధ్యక్షులు ఉమ్మిడిశెట్టి వెంకటేశ్వరరావు, రాష్ట్ర యువ మోర్చా నాయకులు పాలూరి జయ ప్రకాష్ నారాయణ, ఆత్మ కమిటీ డైరెక్టర్ మద్దం శెట్టి శ్రీనివాసరావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గొల కోటి వెంకటేశ్వరరావు, మందపల్లి దేవస్థానం డైరెక్టర్ కోటిపల్లి సుబ్బలక్ష్మి సుబ్రహ్మణ్యం, పల్లాలమ్మ దేవస్థానం డైరెక్టర్ బల్ల రాజు, కోటి పల్లి రఘు, rss కోనసీమ ప్రముఖ్ తోగరు ఆంజనేయులు, కృష్ణ రెడ్డి, వడ్డీ దొరయ్యే సబ్బవరపు సత్యనారాయణ, దివ్య,అల్లు భాస్కర్ గోనెమడతల కనకరాజు తదితరులు పాల్గొన్నారు.