ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కరపత్రం, బుక్‌లెట్ విడుదల*

June 15, 2026 | తెలంగాణ

జనం న్యూస్ జూన్ 15 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి : కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజయవంతంగా 12 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ శాయంపేట మండల శాఖ ఆధ్వర్యంలో కరపత్రం బుక్‌లెట్ విడుదల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ శాయంపేట మండల అధ్యక్షుడు నరహరిశెట్టి రామకృష్ణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నరహరిశెట్టి రామకృష్ణ మాట్లాడుతూ, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 సంవత్సరాలుగా దేశం అభివృద్ధి, సంక్షేమం, జాతీయ భద్రత, మౌలిక సదుపాయాల కల్పన వంటి అన్ని రంగాల్లో విశేష పురోగతి సాధించిందన్నారు. పేదలు, రైతులు, మహిళలు, యువత సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక విప్లవాత్మక పథకాలను అమలు చేసిందని పేర్కొన్నారు. ప్రపంచ వేదికపై భారతదేశ ప్రతిష్ఠను మరింతగా పెంచిన ఘనత మోదీ కే దక్కుతుందని అన్నారు.రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాయారాకుల మొగిలి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల వరకు చేరాయని తెలిపారు. స్వచ్ఛ భారత్, జల్ జీవన్ మిషన్, ఉజ్వల యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన వంటి పథకాలు కోట్లాది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చాయని అన్నారు. మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచంలోనే శక్తివంతమైన దేశంగా ఎదుగుతోందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ కానుగుల నాగరాజు, మండల ప్రధాన కార్యదర్శి భూతం తిరుపతి, సీనియర్ నాయకులు భాసాని విద్యాసాగర్, ఉప్పు రాజు మండల ఉపాధ్యక్షులు కమిటీ రాజశేఖర్, మండల కార్యదర్శి మేకల సుమన్, భూత్ అధ్యక్షులు కోడెపాక సంజీవరావు, పున్నం సాంబయ్య, భాసాని నవీన్, కన్నెబోయిన రమేష్ తదితరులు పాల్గొన్నారు..,

🌐 Select Language:
📰 ePaper