కడప జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు (2026)అందుకున్న మస్తాన్ వల్లి

September 5, 2026 | ఆంధ్రప్రదేశ్

జనం న్యూస్ నందలూరు కడప జిల్లాకడప జిల్లా నందలూరు మండలం దుర్గాపురం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు బొందలదిన్నె మస్తాన్ వల్లి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు- 2026 ను అందుకున్నారు, సెప్టెంబర్ 5 న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జాయింట్ కలెక్టర్ నిధి మీనాఈ అవార్డు ప్రదానం చేశారు.మెథడాలజీ విభాగంలో కంటెంట్ రైటర్ గా కృషి చేసి నందుకు NHRC-జాతీయ సంస్థ చే రవీంద్రనాథ్ ఠాగూర్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ అవార్డు-2026 కూడా అందుకున్నారు.మెథడాలజీ పుస్తక రచయిత కూడా వేలాది మంది డీయస్సీ విద్యా ర్థులకు పోటీ పరీక్షల నిపుణులు గా ప్రసిద్ధి.వందలాది మంది ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ లో మార్గ దర్శకత్వం చేశారుపాఠశాలలో కృత్రిమ మేధ ఆధారంగా పాఠాలు బోధిస్తూకృత్యాధార బోధనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.అవార్డు రావడం పట్ల వల్లి హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి,జిల్లా విద్యాశాఖ కు కృతజ్ఞతలు తెలిపారు.

🌐 Select Language:
📰 ePaper