కాంగ్రెస్ పాలనలో విద్యార్థులు తీవ్ర అన్యాయం: బిఆర్ఎస్

September 5, 2026 | వైరల్ వార్తలు

కాంగ్రెస్‌ వెయ్యి రోజుల పాలనలో హామీలు అమలు కాలే.

రూ.11 వేల కోట్ల స్కాలర్‌షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి.

బీఆర్ఎస్‌ చేపట్టిన పోరుబాట’ భారీ ర్యాలీ, నిరసనలో మాజీ ఎమ్మెల్యే హనుమంత్ సిందే

బిచ్కుంద సెప్టెంబర్ 5 ( జనం న్యూస్):కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో విద్యార్థులు, నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తోందని జుక్కల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే హనుమంత్ సిందే ఆరోపించారు. విద్యార్థులు, యువతకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే వరకు బీఆర్ఎస్‌ పక్షాన నిరంతర పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ బీఆర్ఎస్‌ చేపట్టిన ‘420 మోసాలపై పోరుబాట’లో భాగంగా శనివారం బిచ్కుంద మండల కేంద్రంలో భారీ ర్యాలీ, నిరసన నిర్వహించారు. కమ్మర్ గుడి నుంచి ప్రారంభమైన ర్యాలీలో వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించాలి: మాజీ ఎమ్మెల్యే హనుమత్ సిందేఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ., హైదరాబాద్‌ యూత్‌ డిక్లరేషన్‌ను తక్షణమే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. పెండింగ్‌లో ఉన్న సుమారు రూ.11 వేల కోట్ల స్కాలర్‌షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించాలని కోరారు. విద్యార్థులకు రూ.5 లక్షల భరోసా కార్డు, కళాశాల విద్యార్థినులకు ఉచిత స్కూటీ, అర్హులైన నిరుద్యోగ యువతకు నెలకు రూ.4 వేల నిరుద్యోగ భృతి, అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాల భర్తీ వంటి హామీలను కాంగ్రెస్‌ ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. జీవో నంబర్‌ 97తో పాలిటెక్నిక్‌ కళాశాల విద్యార్థుల ఆశలను ప్రభుత్వం నీరుగార్చిందని ఆరోపించారు.విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం వద్దుపెండింగ్‌ సమస్యలను తక్షణమే పరిష్కరించి విద్యార్థులు, నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని మాజీ ఎమ్మెల్యే డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం మెడలు వంచే వరకు బీఆర్ఎస్‌ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో జుక్కల్ నియోజకవర్గం బి ఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper