నందికొండలో స్కూళ్ల చుట్టూ పోకిరీల హల్‌చల్..!విద్యార్థుల భద్రత గాలికేనా..

September 5, 2026 | తెలంగాణ

పోకిరిలపై కొరవడిన నిఘా వ్యవస్థ.

జనం న్యూస్ -సెప్టెంబర్ 6- నాగార్జునసాగర్ టౌన్-నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ పరిధిలోనీ ప్రభుత్వ జూనియర్ కళాశాల, సెయింట్ జోసెఫ్ స్కూల్, ఐపీఎస్ స్కూల్ పరిసరాల్లో పోకిరీల సంచారం అధికమయ్యింది. విద్యార్థులను వేధిస్తూ హల్‌చల్ చేస్తున్నారంటూ అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి.పిల్లలను వేధిస్తున్నా ర్యాగింగ్ చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ తల్లిదండ్రుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇటీవల మల్లేపల్లిలో జరిగిన తీవ్ర ఘటన నేపథ్యంలోనూ స్కూళ్ల పరిసరాల్లో పోలీసుల నిఘా కొరవడటంపై తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమౌతుంది.ఏదైనా పెద్ద ఘటన జరిగే వరకు పోలీసులు స్పందించరా అంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.స్కూళ్లు, కళాశాలల వద్ద వెంటనే పోలీసుల నిఘా పెంచాలని పిల్లల తల్లిదండ్రులు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.విద్యార్థులను వేధిస్తున్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు పోలీసు వారిని కోరుతున్నారు.మైనర్ల బైక్‌ల హల్‌చల్‌ చేస్తూ విద్యార్థులకు వేధింపులకు గురి చేస్తున్నారు.స్కూళ్లు, కాలేజీల వద్ద గుంపులుగా బైక్‌లపై తిరుగుతూ విద్యార్థులను వెంబడిస్తుహారన్‌లతో హల్‌చల్‌ చేస్తున్నారు. పోకిరిల అసభ్య ప్రవర్తనపై తల్లిదండ్రుల్లో ఆందోళన.మైనర్ల డ్రైవింగ్‌పై పోలీసుల నిఘా కొరవడిందని విద్యార్థుల భద్రతకు చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారని ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నారు.పిల్లల భద్రత విషయంలో నిర్లక్ష్యానికి తావులేకుండా, ఇప్పటికైనా పోలీసులు చర్యలు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

🌐 Select Language:
📰 ePaper