నాగార్జునసాగర్ వద్ద రోడ్డు ప్రమాదంకారు- ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి

జనం న్యూస్- సెప్టెంబర్ 6- నాగార్జునసాగర్ టౌన్- నాగార్జునసాగర్ నెల్లికల్ ఎక్స్ రోడ్డు వద్ద శనివారం ఉదయం కారు ద్విచక్ర వాహనం ఢీకొని జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. నాగార్జునసాగర్ పైలాన్ కాలనీకి చెందిన బత్తుల సైదులు (45) వ్యక్తిగత పనుల నిమిత్తం సాగర్ నుంచి హాలియా వైపు వెళ్తుండగా మాచర్ల వైపు వస్తున్న ఎర్టిగా కారు(టి జి 29 బిబి 2861) అతివేగంగా వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీకొనగా ద్విచక్ర వాహనదారుడు సైదులు తలకు బలమైన గాయం కావడంతో ప్రమాద స్థలంలోనే చనిపోవడం జరిగింది. విషయం తెలుసుకున్న విజయపురి టౌన్ ఎస్ఐ సతీష్ సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని కమలా నెహ్రూ ఏరియా ఆసుపత్రికి తరలించారు, తన సిబ్బందితో కలిసి ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు, మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.