కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేస్తాం

June 17, 2026 | తెలంగాణ

పార్టీ శ్రేయస్సు దృష్ట్య కలిసికట్టుగా ముందుకు వెళ్తాం*

పాత్రికేయుల సమావేశంలో న్యాల్కల్, పట్టణ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి, నరేష్ గౌడ్*

జనం న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో ఇంచార్జ్ మొహమ్మద్ ఇమ్రాన్ 17 జూన్ జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేస్తామని, పార్టీ శ్రేయస్సు దృష్ట్య కలిసికట్టుగా నాయకులు, కార్యకర్తలతో ముందుకు సాగుతామనీ, పదవులను పది మంది ఆశించడం సహజం కానీ ఇచ్చేది ఒక్కరికే అని న్యాల్కల్ మండల, జహిరాబాద్ పట్టణ అధ్యక్షులు కొత్తపల్లి భాస్కర్ రెడ్డి, నరేష్ గౌడ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా శాసన సభ పరిధి పట్టణంలోని మాజీ మంత్రి, నియోజకవర్గ ఇంచార్జ్ చంద్రశేఖర్ క్యాంప్ కార్యాలయంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో నూతనంగా ఎన్నికైన నియోజకవర్గ పరిధిలోని పట్టణ, మండలాల అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ అధిష్టాననికి తమను నియమించినందుకు కృతతలు తెలిపి పార్టీఆదేశాలు, నాయకత్వ సూచనల మేరకు పార్టీని బలోపేతం చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, జిల్లా అధ్యక్షులు నిర్మల జగ్గారెడ్డి, స్థానిక ఎంపీ షేట్కార్, చైర్మన్ గిరిధర్ రెడ్డి, ఇంచార్జ్ డా చంద్రశేఖర్ చంద్రశేఖర్ లకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని, వారి సూచనల మేరకు పార్టీ సైనికుల్ల పని చేసి పార్టీ విజయం కోసం కృషి చేస్తామని, మొన్నటివరకు పని చేసిన అధ్యక్షుల సూచనలు తుచ తప్పకుండ పాటిస్తూ ముందుకు వెళ్తామని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమలు అర్హులకు చేరే విధంగా చూస్తామని అన్నారు. కార్యక్రమంలో కోహిర్ అధ్యక్షులు సువర్ణ మల్లన్న పాటిల్, జహిరాబాద్, కోహిర్ పట్టణ అధ్యక్షులు నరేష్ గౌడ్, మీర్ ముజఫ్ఫర్ హుసేన్, న్యాల్కల్ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి, జహిరాబాద్ ఉగ్గెల్లి రాములు యాదవ్, మొగుడం పల్లి పవన్ రాథోడ్, చింతల్ ఘాట్ గ్రామ సర్పంచ్ విద్య సాగర్, లచ్చ నాయక్ తండా సర్పంచ్ ప్రేమ్ రాథోడ్, కోహిర్ పట్టణ నాయకులు మొహమ్మద్ హమేద్, కౌన్సిలర్ మహేష్, 21 వ వార్డు అధ్యక్షులు మొహమ్మద్ గౌస్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper