కాంగ్రెస్ మైనార్టీ సెల్ రాష్ట్ర చైర్మన్ ఇర్ఫాన్ అలీకి ఘన సన్మానం

May 30, 2026 | తెలంగాణ

జనం న్యూస్ మే 30 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ ఇర్ఫాన్ అలీను శనివారం గాంధీ భవన్‌లో మూసాపేట డివిజన్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు చును పాషా ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా నాయకులు ఇర్ఫాన్ అలీకి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలియ జేశారు. పార్టీ బలోపేతం, మైనార్టీల అభ్యున్నతి కోసం ఆయన చేస్తున్న కృషిని అభినందించారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మైనార్టీ సెల్ కీలక పాత్ర పోషిస్తోందని వారు పేర్కొన్నారు.ఈ సమావేశం ఆత్మీయ వాతావరణంలో సాగగా, పార్టీ కార్యక్రమాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అందరూ సమన్వయంతో పనిచేయాలని ఇర్ఫాన్ అలీ సూచించినట్లు నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో బోయిన్‌పల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ అస్లాం సోఫీ, అమీర్ టీంకు, అరుణ్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం నాయకులు ఇర్ఫాన్ అలీతో కలిసి ఫోటోలు దిగుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

🌐 Select Language:
📰 ePaper