కాట్రేనికోనలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

August 10, 2026 | ఆంధ్రప్రదేశ్

జనం న్యూస్ ఆగస్టు 10 ముమ్మిడివరం ప్రతినిధి( గ్రంధి నానాజీ)డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండల పరిషత్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని మండల అభివృద్ధి అధికారి బి రాజేశ్వర్ రావు, తహసీల్దార్ వి రవికిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించడానికి ఈ వేదిక ఎంతో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా కొనియాడారు. ఈరోజు జరిగిన కార్యక్రమంలో 4 దరఖాస్తులు అందాయని మండల అభివృద్ధి అధికారి, తహసీల్దార్ తెలిపారు. మండల స్థాయి అధికారులు పూర్తి బాధ్యతతో తమ శాఖలకు సంబంధించిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper