నిర్వాసిత రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఆందోళన చేపడతాం
జనం న్యూస్, ఆగష్టు 10,అచ్యుతాపురం:అచ్యుతాపురం మండలం పూడిమడక గ్రామం వద్ద ఏర్పాటు అవుతున్న ఏన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ కోసం వ్యవసాయ పంట భూమిని కోల్పోయిన నిర్వాసిత రైతులందరికి భూ సేకరణ సమయంలో ప్రభుత్వం మరియు అధికారులు ఇచ్చిన హామీలును నెరవేర్చి,ప్రజా ప్రయోజనాలు చట్టం 2013 ను వర్తింపజేసి ఉద్యోగ- ఉపాధి మరియు ఆర్- కార్డులు కల్పించాలని కలెక్టరేట్ వద్ద శాంతియుత నిరసన తెలియజేసి, అనకాపల్లి కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ లో కలెక్టర్ కు వినతిపత్రాన్ని అందించారు.ఈ సందర్బంగా రైతు నాయకులు చోడిపల్లి అప్పారావు, ఉమ్మిడి అప్పారావు మాట్లాడుతూ.. భూములు ఇచ్చిన నిర్వాసిత రైతుల అభిప్రాయాలకు వ్యతిరేకంగా నిర్మాణ పనులు చేపడితే తదనంతరం జరిగే పరిణామాలకు ప్రభుత్వం మరియు ఏపీఐఐసి అధికారులే పూర్తి బాధ్యత వహించవలసి వస్తుందని,ఈ సమస్య పై కలెక్టర్ స్పందించని పక్షంలో రైతులు అందరిని ఐక్యం చేసి ఏన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ గేట్ ముందు భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు మరియు వంటావార్పు చేపడతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పూడిమడక ఏన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ పవర్ ప్రాజెక్ట్ భూ-నిర్వాసిత రైతులు, స్థానికులు చోడిపల్లి పెంటయ్య, మైలపల్లి దానయ్య,మేరుగు తాతారావు,రాజమ్మ, బర్రి పైడితల్లి,మైలపల్లి కాసులమ్మ,చిట్టెమ్మ,ఉమ్మడి కాసులమ్మ తదితరులు పాల్గొన్నారు.