భీమదేవరపల్లి…వంగర..*భారతరత్న మాజీ ప్రధాని దివంగత పి.వి.నరసింహారావు
జనం న్యూస్ 10-08-2026 వంగర గ్రామాన్ని సందర్శించిన మాజీ ప్రధాని భారతరత్న దివంగత పి.వి.నరసింహారావు.కూతురు డా.సరస్వతి అల్లుడు డా.కల్వకోట శరత్…భారతరత్న మాజీ ప్రధాని దివంగత పి.వి.నరసింహారావు కూతురు డా.సరస్వతి దంపతులు చిన్ననాట పెరిగిన స్వంత ఊరు పర్యటనకు గురువారం సాయంత్రం వచ్చారు.ఐదు దశాబ్దాలకు పూర్వం తెలంగాణ నుండి అమెరికాలో స్థిరపడిన కొద్దిమందిలో డా.సరస్వతి శరత్ దంపతులు…అమెరికాలో వైద్యరంగంలో పేరొందిన డాక్టర్లుగా సపరిచతులు.చాలాకాలం తరువాత హైదరాదుకు వచ్చిన వారు పి.వి.కుమారుడు ప్రభాకర్ రావు ఆహ్వానం మేరకు వంగరకు వచ్చారు..వంగరలో చిన్ననాట గడిపిన అనుభవాలను డా.సరస్వతి గుర్తు చేసుకొని ఉద్వేగానికి లోనయ్యారు…శుక్రవారంనాడు పి.వి.మ్యూజియంలో తన తండ్రిగారి అలనాటి ఫోటోలు,వాడిన వస్తువులు తిలకించి. పి.వి.విగ్రహానికి పూలమాల వేసి నివాళర్పించారు డా.సరస్వతి దంపతులు.కైలాస కళ్యాణి క్షేత్రం పాత శివాలయంలో అభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు.అనంతరం.వంగర డా.రంగారావు గురుకుల పాఠశాల/కళాశాల ఇంటర్ విద్యర్థులతో నిర్వహించిన ఒక కార్యక్రమంలో డా.శరత్ కల్వకోట మాట్లాడుతూ హుజురాబాద్ ప్రాంత పేద పిల్లలకు ఉచిత ఆశ్రమ విద్యను అందించే సంకల్పంతో మంత్రిగా డా.రంగారావు ఆశ్రమ పాఠశాల నెలకొల్పడానికి క్రుషి చేయడం సుదీర్ఘ చరిత్ర వున్న ఈ పాఠశాలలో విద్య నేర్చుకున్న అనేకమంది ఉన్నత స్థానాల్లో స్థిరపడడం గొప్ప విషయమని తెలిపారు…విద్యార్థులు మంచి పౌరులుగా ఎదగాలని తల్లిదండ్రులను గౌరవిస్తూ అద్యాపకులు నేర్పిన విద్యపట్ల అవగాహనా పెంచకొని సుస్థిర జీవితంలో సుఖపడాలని ఉద్బోదించారు.వంగర గతంలో పోలిస్తే చాలా అభివృద్ధి చెందింది.ఆత్మీయత గొప్పది.
పి.వి.కుమార్తె డా.సరస్వతి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో నాణ్యమైన విద్య కొరకు తన సోదరుడ దివంగత డా.రంగారావు నెలకొల్పిన పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను అభినందించారు…తన బాల్యం వంగరలో గడిచినట్లు గుర్తు చేసారు..ఇక్కడే శిశు విద్య కొనసాగింది.. నాటి స్మ్రుతులు మదిలో వున్నాయన్నారు…ప్రభుత్వ సహాయ సహకారంతో నిర్వహిస్తున్న ఆశ్రమ కళాశాలలో తల్లిదండ్రులకు దూరంగా ఉపాద్యాయులే తల్లిదండ్రులుగా నాణ్యమైన విద్య పొందడం గొప్ప అవకాశమని తెలిపారు.ఉన్నతలక్ష్యసాధనకు క్రుషి చేస్తే విజయాలు వరిస్తాయని తెలిపారు…ఈ విషయంలో స్వర్గీయ ప్రధాని పి.వి.పేరును శాశ్వతంగా నిలపాలని పిలుపునిచ్చారు.పి.వి.కుమారుడు ప్రభాకర్ రావు మాట్లాడుతూ పేద ప్రజలకు సమాన విద్యతో పాటు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో నాడు విద్యా మంత్రిగా మొదటి ఆశ్రమ పాఠశాల నల్గొండ సర్వేల్లో ప్రారంభించారని ,కేంద్ర మానవ వనరుల మంత్రిగా నాటి ప్రధాని రాజీవ్ గాందీ కోరిక మేరకు దేశవ్యాప్తంగా నవోదయపాఠశాల ఏర్పాటు 1970 నాటి ఆశ్రమ విద్యాలయాల ఏర్పాటుకు మూలం అని వివరించారు. ఇక వంగర గురుకుల పాఠశాల తన సోదరుడు డా.రంగారావు ప్రత్యేక చొరవ…ఆయన బ్రహ్మచారి…కుటుంబ సభ్యులు లేరు కాబట్టి అందరిని కుటుంబ సభ్యలుగా బావించేవారు…అందుకే భూమిని విరాళంగా ఇచ్చి శాశ్వత భవనాలకు శ్రీకారం చుట్టారు.రంగారావు మానస పుత్రికే ఈ ఆశ్రమ పాఠశాల.కుటుంబీకులుగా పాఠశాలకు అనేక రకాల సాయం చేస్తున్నాము..మాకు కావలసినది ఉన్నత ప్రమాణాలు…పిల్లలు మంచి స్థానంలో నిలబడడం…పి.వి.పేరు నిలబడడం.పి.వి.మనుమడు మనీష్ ఏఐ ప్రాముఖ్యతను వివరించారు…మారుతున్న కాలంతో పోటీ పడాలంటే దానకి అనుగుణంగా విద్యాభిరుచలు పొందాలని అప్పుడు మాత్రమే ఉపాది అవకాశాలు వుంటాయని తెలిపారు.స్థానిక యస్ఐ దివ్య సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా వుండాలని…తెలియని కాల్స్ వచ్చి ఓటిపి ఇతర వివరాలు అడిగితే ఇవ్వరాదని…కోరారు.ఈ కార్యక్రమంలో ఆశ్రమ పాఠశాలల గైడెన్స్ అధికారి తారా సింగ్ , పి.వి.మదన్ మోహన్,పి.వి.శరత్, కళాశాల ప్రిన్సిపాల్ అప్రొజు సుల్తానా ,సీనియర్ పాకల్టి భార్గవి,సిబ్బంది పెరుమాళ్ రవి ,లక్ష్మీకాంత్,వెంకటరెడ్డి,బ్ర.శ్రీ .చతుర్వేది బుచ్చిరెడ్డి,మల్లారెడ్డి,సురేశ్,సుమన్,
ప్రభుతులు పాల్గొన్నారు…