కూకట్‌పల్లిలో ఘనంగా మహిళల ప్రత్యేక వస్త్రాల దుకాణం ప్రారంభం

August 31, 2026 | వైరల్ వార్తలు

కెపిహెచ్‌బీ ఐరిస్ భవనంలో ప్రారంభమైన నూతన వస్త్రాల కేంద్రం

జనం న్యూస్ ఆగస్టు 31 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కూకట్‌పల్లి లో మహిళల అభిరుచులు, అవసరాలకు అనుగుణంగా నూతన తరహా ఫ్యాషన్ దుస్తులు, ప్రత్యేకంగా రూపొందించిన వస్త్రాలను అందించేందుకు ఏర్పాటు చేసిన షీ డిజైనర్ స్టూడియో ప్రారంభోత్సవ కార్యక్రమం సోమవారం కూకట్‌పల్లిలోని కెపిహెచ్‌బీ ఐరిస్ భవనంలో ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్, టీపీసీసీ ఉపాధ్యక్షులు, తెలంగాణ కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్, బండి లకుమ దేవి ముఖ్య అతిథులుగా హాజరై నూతన వస్త్రాల కేంద్రాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ మహిళల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన, ఆధునిక డిజైన్లతో కూడిన దుస్తులు, వస్త్రాలను అందించేందుకు షీ డిజైనర్ స్టూడియోను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. నేటి పోటీ ప్రపంచంలో వినియోగదారుల అభిరుచులను గుర్తించి నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వడం వ్యాపార అభివృద్ధికి ఎంతో అవసరమని పేర్కొన్నారు.కొత్తగా ప్రారంభించిన ఈ వస్త్రాల కేంద్రం కూకట్‌పల్లి ప్రాంత మహిళల ఆదరణ పొందాలని ఆకాంక్షించిన ఆయన, నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. వ్యాపారం దినదినాభివృద్ధి చెంది మంచి పేరు సంపాదించాలని కోరుకున్నారు.కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీవాస్ బాబు, గాదే శివ చౌదరి, రామారావు, రమణ, సంధ్య, కల్పన తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షీ డిజైనర్ స్టూడియో నిర్వాహకులకు బండి రమేష్ దంపతులు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.

🌐 Select Language:
📰 ePaper