కూటమి ప్రభుత్వంలో రైతే రాజు రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయంమార్కెట్ కమిటీ అభివృద్ధి సహకరిస్తా

August 31, 2026 | వైరల్ వార్తలు

జరం న్యూస్ ఆగస్టు 31 ముమ్మిడివరం ప్రతినిధి (గ్రంధి నానాజీ)రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఘనంగా కాకినాడ రూరల్ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారందేశానికి అన్నం పెడుతున్న అన్నదాతల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. నూతనంగా ఎన్నికైన కాకినాడ రూరల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని మంత్రి సుభాష్ తెలిపారు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ వ్యవసాయం మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం మహోత్సవం సోమవారం కాకినాడ ఇంద్రపాలెంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగింది. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు (నానాజీ)అధ్యక్షత వహించారు.నూతనంగా ఎన్నికైన కాకినాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం మహోత్సవంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ కూటమిలో పనిచేసిన అందరికీ గుర్తింపు ఉంటుందని చెప్పారు. గడచిన రెండున్నర ఏళ్ల హయాంలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. ప్రతిపక్ష వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని అభివృద్ధితో ఐక్యంగా తిప్పుకొట్టాలని పిలుపునిచ్చారు. గత వైసిపి హయాంలో అన్నదాతలను అన్ని విధాలుగా మోసం చేశారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్నదాత సుఖీభవ పథకం, రైతులకు గిట్టుబాటు ధర, ఎరువులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచడం వంటి కార్యక్రమాలు దిగ్విజయంగా అమలు చేసామన్నారు. రైతులు పండించిన పంటను ఆర్ బి కే కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి 24 గంటల్లో రైతులు అకౌంట్లో సొమ్ము జమ చేసామన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ మాసుమేను మంగ మాట్లాడుతూ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధుల సహకారంతో మార్కెట్ కమిటీ అభివృద్ధికి నిరంతరం పనిచేస్తానని చెప్పారు. అనంతరం మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులను ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, పిల్లి సత్యనారాయణమూర్తి, జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా, రంబాల వెంకటేశ్వరరావు, చైల్డ్ రైస్ కమిషన్ చైర్మన్ సూర్యనారాయణ రాజు, కరప ఏఎంసీ చైర్మన్ ముద్రగడ్డ రమేష్, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ, మాజీ జడ్పీటీసీ నులుకుర్తి వెంకటేశ్వరరావు, రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, గోదావరి డెల్టా నీటి సంఘం అధ్యక్షులు సునీల్, కుడా చైర్మన్ తలాటం సత్య, ఎంపీపీ నందిపాటి అనంతలక్ష్మి, టీడీపీ, జనసేన, బీజేపీలకు చెందిన కూటమి నాయకులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper