ప్రజావాణిలో 14 దరఖాస్తులు

—-ఎంపీడీవో గోపాలకృష్ణ
బిచ్కుంద ఆగస్టు 31 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 14 దరఖాస్తులు వచ్చాయని ఎంపీడీవో గోపాలకృష్ణ తెలిపారు.వచ్చిన దరఖాస్తుల వివరాలు:MRO కార్యాలయానికి సంబంధించినవి – 4 ఎలక్ట్రిసిటీకి సంబంధించినవి – 1 మున్సిపాలిటీ,–2 MPDO – 2 . పంచాయతీరాజ్ ఏఈ–5 మొత్తం 14 దరఖాస్తులు వచ్చాయని, ఆయా శాఖలకు పంపిస్తామని, 30 రోజుల్లో ఆ పనులను పూర్తి చేయాల్సి వస్తది అని ఎంపీడీవో గోపాలకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో వేణుగోపాల్, తాసిల్దార్ సిబ్బంది ఐకెపి ఆప్కారి ఎస్సై మున్సిపాలిటీ కస్తూర్బా గాంధీ బీసీ హాస్టల్ సిబ్బంది తదితర అధికారులు పాల్గొన్నారు.