కూకట్‌పల్లి ఇన్‌స్పెక్టర్ స్వామిగౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నేత చున్నుపాషా
జనం న్యూస్, ఆగస్టు 14, తెలంగాణ స్టేట్ ఇంచార్జ్: చింతకుంట్ల శ్రీనివాస్ రెడ్డి కూకట్‌పల్లి పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా ఇటీవల పదవీ బాధ్యతలు స్వీకరించిన స్వామిగౌడ్‌ను మూసాపేట డివిజన్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు చున్నుపాషా శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సబ్‌ఇన్‌స్పెక్టర్ తుకారాంకు శుభాకాంక్షలు తెలిపారు.కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించేందుకు అధికారులు కృషి చేయాలని చున్నుపాషా ఆకాంక్షించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన అధికారులకు స్థానిక ప్రజలు, నాయకులు సహకరించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో అడ్మిన్ ఎస్‌ఐ రవీందర్, చంద్రశేఖర్, నాయకులు టీంకు తదితరులు పాల్గొన్నారు.