కూకట్పల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వీల్ చైర్లు, వాకర్ల పంపిణీ*
జనం న్యూస్ ఆగస్టు 10 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి : సేవయే ధ్యేయంగా ముందుకు సాగుతున్న కూకట్పల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు కూకట్పల్లి శివానంద రిహబిలిటేషన్ హోమ్ లో రోగులకు వీల్ చైర్లు మరియు వాకర్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శివానంద రిహబిలిటేషన్ హోమ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సాయిబాబా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.కూకట్పల్లి లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ వెంకటరెడ్డి యక్కంటి వై వి ఆర్ కార్యదర్శి శ్రీనివాస రెడ్డి సభ్యులు శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొని వీల్ చైర్లు, వాకర్లను రోగులకు అందజేశారు.ఈ సందర్భంగా శివానంద రిహబిలిటేషన్ హోమ్ నిర్వాహకులు లయన్స్ క్లబ్ చేస్తున్న సేవా కార్యక్రమాలను మనస్ఫూర్తిగా అభినందించారు. సమాజంలో అవసరమైన వారికి అండగా నిలుస్తున్న లయన్స్ క్లబ్ సేవలను కొనియాడారు.లయన్స్ క్లబ్ అధ్యక్షులు వెంకటరెడ్డి వై వి ఆర్ మాట్లాడుతూ, “భవిష్యత్తులోనూ ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని నిర్వహిస్తామని” తెలిపారు.