బిఆర్ఎస్ పార్టీ నాయకులు పండగ సాయన్న విగ్రహం తొలగింపుపై నాయకుల ఆగ్రహం

August 10, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం 09. 08 2026 జహీరాబాద్ నియోజకవర్గం, మొగడంపల్లి మండలం: పండగ సాయన్న విగ్రహాన్ని తొలగించిన ఘటనపై బీఆర్‌ఎస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముంత్రాజ్‌లపై కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని బీఆర్‌ఎస్ నాయకులు ఆరోపించారు. ప్రభుత్వం స్పందించాల్సిన అంశాలపై కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వారు విమర్శించారు.ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకుడు షికారి గోపాల్ మాట్లాడుతూ పండగ సాయన్న విగ్రహాన్ని తొలగించడం ముంత్రాజ్ సమాజం మనోభావాలను దెబ్బతీసే చర్యగా అభివర్ణించారు. చారిత్రకంగా, సామాజికంగా ప్రత్యేక గుర్తింపు ఉన్న పండగ సాయన్నకు గౌరవం కల్పించాల్సిన ప్రభుత్వం ఆయన విగ్రహాన్ని తొలగించడం సరైన చర్య కాదన్నారు. విగ్రహం తొలగింపుపై ప్రభుత్వం వెంటనే స్పందించి వాస్తవ పరిస్థితులను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముంత్రాజ్‌లకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం చూపుతోందని, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయని షికారి గోపాల్ ఆరోపించారు. ముంత్రాజ్ సమాజం ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్యలను సహించబోమని స్పష్టం చేశారు. పండగ సాయన్న విగ్రహాన్ని తిరిగి ప్రతిష్ఠించి, సమాజం మనోభావాలను గౌరవించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ప్రజల మనోభావాలతో ముడిపడి ఉన్న ఇలాంటి అంశాల్లో ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, సమస్యను మరింత జటిలం చేయకుండా వెంటనే పరిష్కరించాలని బీఆర్‌ఎస్ నాయకులు కోరారు. ముంత్రాజ్‌లకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని వారు తెలిపారు.

🌐 Select Language:
📰 ePaper