లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా లగిశెట్టి నరసింహులు ప్రమాణ స్వీకారం.

August 10, 2026 | తెలంగాణ

జనం న్యూస్: 10ఆగస్టు సోమవారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై. రమేష్ :పేదలకు మరింత చేరువగా ‘లయన్స్’ సేవలు క్లబ్ నూతన అధ్యక్షుడు లగిశెట్టి నర్సింహులు. పేదలకు మరింత చేరువగా లయన్స్ క్లబ్ సేవలు అందించనున్నట్లు క్లబ్ అధ్యక్షుడు లగిశెట్టి నర్సింహులు తెలిపారు. స్థానిక లయన్స్ క్లబ్‌లో ఆదివారం నూతన కమిటీ ప్రమాణస్వీకార కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన 320 మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ అమర్నాథరావు, ఇన్నర్‌మెన్ ఆఫీసర్ బసవేశ్వర రావు నూతన కార్యవర్గ సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలోని అనాథలైన వర్గాలకు అండగా నిలుస్తూ విద్య, వైద్యం, పేదల సంక్షేమం, రక్తదాన శిబిరాలు, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. క్లబ్‌కు నిరంతరం కొనసాగిస్తామన్నారు.లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గంప్రజల నుంచి లభిస్తున్న ఆదరణను మరింత పెంచే విధంగా సమిష్టిగా కృషి చేస్తామని నూతన కమిటీ సభ్యులు చెప్పారు. క్లబ్ నూతన అధ్యక్షుడిగా లగిశెట్టి నర్సింహులు, ఉపాధ్యక్షులుగా సత్యనారాయణ, నర్సింహారెడ్డి, వినోదరావు, ప్రధాన కార్యదర్శిగా శ్రీధర్, సహాయ కార్యదర్శిగా శేఖర్, కోశాధికారిగా శ్రీనివాస్, పీఆర్వోగా రవీందర్ ప్రమాణ స్వీకారం చేశారు

🌐 Select Language:
📰 ePaper