చెయ్యేరు భవాని సెంటర్ కనకదుర్గమ్మకు ఆషాఢ సారె

August 10, 2026 | ఆంధ్రప్రదేశ్

జనం న్యూస్ ఆగస్టు 10 ముమ్మిడివరం (ప్రతినిధి గ్రంధి నానాజీ)కాట్రేనికోన మండల పరిధి చెయ్యేరు గ్రామ పంచాయతీ శివారు చెయ్యేరు భవాని సెంటర్ వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో సోమవారం ఆషాఢ సారె కార్యక్రమం భక్తి సందడితో జరిగింది. కనకదుర్గమ్మను ఇంటి ఇలవేల్పుగా, ఆడపడుచుగా భావించిన మహిళా భక్తులు సమీప ప్రాంతాల నుంచి పసుపు, కుంకుమ, గాజులు, చీరలు, సారె సామగ్రితో తరలి వచ్చి అమ్మవారికి ఘనంగా సమర్పించారు. భక్తులు ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు కోరారు. ఆలయ కమిటీ భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసి సారె సమర్పించిన వారికి ఉచిత ప్రసాదాలు అందించింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆషాఢంలో అమ్మవారికి సారె ఇవ్వడం వల్ల గ్రామంలో సుభిక్షం, శాంతి వర్ధిల్లుతుందని భక్తులు మొక్కులు చెల్లించారు.

🌐 Select Language:
📰 ePaper