కోరుట్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 114 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి – షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్

July 30, 2026 | తెలంగాణ

జనం న్యూస్ | జూలై 30 | జగిత్యాల జిల్లా, కోరుట్ల: తెలంగాణ ప్రభుత్వం పేద, మధ్యతరగతి కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో అమలు చేస్తున్న కళ్యాణలక్ష్మి – షాదీ ముబారక్ పథకాల కింద కోరుట్ల పట్టణానికి చెందిన 114 మంది లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పంపిణీ చేశారు.కోరుట్లలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో 114 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.1,14,13,224/- (ఒక కోటి పద్నాలుగు లక్షల పదమూడు వేల రెండు వందల ఇరవై నాలుగు రూపాయలు) విలువైన చెక్కులను ఎమ్మెల్యే స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆర్థిక ఇబ్బందులు వివాహాలకు అడ్డంకిగా మారకుండా ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన పెంచుకొని అర్హత ఉన్నవారు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకుని లబ్ధి పొందాలని సూచించారు.కోరుట్ల నియోజకవర్గ అభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజలకు అవసరమైన సేవలు, సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందేలా నిరంతరం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు, లబ్ధిదారులు మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.ఫోటో క్యాప్షన్:కోరుట్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 114 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి – షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్.

🌐 Select Language:
📰 ePaper