పట్నం రుక్కమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన బండి రమేష్

July 30, 2026 | తెలంగాణ

జనం న్యూస్ జులై 30 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి : శాసన మండలి సభ్యులు, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ పట్నం మహేందర్ రెడ్డి కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మాతృమూర్తి పట్నం రుక్కమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన నేపథ్యంలో, రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్, టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ ఈరోజు షాబాద్‌లోని వారి నివాసానికి వెళ్లి రుక్కమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పట్నం కుటుంబ సభ్యులను పరామర్శించి, రుక్కమ్మ మృతిపట్ల ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ విషాదాన్ని భరించే శక్తిని కుటుంబ సభ్యులకు భగవంతుడు ప్రసాదించాలని బండి రమేష్ ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో పుష్పా రెడ్డి, గొట్టుముక్కల వెంకటేశ్వరరావు, మస్తాన్ రెడ్డి, శ్రీనివాస్ బాబు, రంగమోహన్, నారాయణ తదితరులు పాల్గొని రుక్కమ్మ చిత్రపటానికి నివాళులు అర్పించారు.

🌐 Select Language:
📰 ePaper