గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్
జనం న్యూస్ | ఆగస్టు 12: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడుతున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. బట్టాపూర్ గ్రామ శివారులో వాహనాల తనిఖీల సందర్భంగా నిందితులు పట్టుబడ్డారు. పోలీసుల విశ్వసనీయ సమాచారం మేరకు 11-08-2026న బట్టాపూర్ గ్రామ శివారులో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా షేక్ ఆజం (36), అమోల్ దుమ్మాపాల్ చౌకే (23), షేక్ ఇమ్రాన్ (28) అనుమానాస్పదంగా పట్టుబడ్డారు.వారి వద్ద నుంచి 240 గ్రాముల ఎండు గంజాయి, 37 గంజాయి ప్యాకెట్లు, గంజాయి తరలించేందుకు ఉపయోగించిన ఒక స్కూటీ, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.నిందితులు మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాంతం నుంచి గంజాయి తీసుకువచ్చి ఏర్గట్ల మండలంలో విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.ఈ ఘటనపై సీఆర్ నం.68/2026, ఎన్‌డీపీఎస్ చట్టం-1985లోని 8(సి) ఆర్/డబ్ల్యూ 20(బి)(ii)(ఏ) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.సీఐ సత్యనారాయణ పర్యవేక్షణలో ఏర్గట్ల ఎస్‌ఐ పడాల రాజేశ్వర్, ఎస్‌ఐ రాము ఆధ్వర్యంలో పోలీసులు కేసును ఛేదించడంలో కీలకంగా వ్యవహరించారు.గంజాయి వంటి మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంమని పోలీసులు హెచ్చరించారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు