గాంధీభవన్ లో శనివారం జరిగిన మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ సమావేశం లో పాల్గొన్న టిపిసిసి ఉపాధ్యక్షుడు కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్

May 30, 2026 | తెలంగాణ

జనం న్యూస్ మే 30 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి గాంధీ భవన్ ప్రాంగణంలో ఉన్నటువంటి ఇందిరా భవన్ లో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ ఏఐసిసి ఇన్చార్జ్ మీనాక్షి నటరాజ్ ఏఐసీసీ సెక్రెటరీ సచిన్ సావంత్ ఆధ్వర్యంలో జరిగిన మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గo సమావేశంలో కార్యక్రమంలో బండి రమేష్ పాల్గొనడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏసిసి ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ పార్లమెంటు పరిధిలోని అసెంబ్లి నియోజకవర్గాల్లో బూత్ లెవెల్ ఏజెంట్లను మరియు అన్ని డివిజన్లకు అధ్యక్షులను మరియు ఇతర అనుబంధ సంఘాల కమిటీలను త్వరితగతిన ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సమావేశాన్ని ఉద్దేశించి మీనాక్షి నటరాజన్ తెలియజేశారు.పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో గ్రామస్థాయి నుండి సంస్థగతంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తీసుకోవలసిన సలహాలు సూచనలను సమావేశంలో వివరించారు.కూకట్పల్లి నియోజకవర్గ ఇంచార్జ్ బండి రమేష్ మాట్లాడుతూ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో కూకట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో బి ఎల్ ఎ ల నియామకాలపై నిర్వహించిన సమావేశాలపై పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ మరియు ఎఐసిసి ఇన్చార్జ్ మీనాక్షి నటరాజ్ పూర్తి స్థాయి నివేదికను అందించి పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలను అంద చేస్తా మన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, పార్లమెంట్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిలు తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper