చింతలపల్లి అంగన్వాడీ కేంద్రంలో బడి బాట కార్యక్రమం

June 17, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ 17 జూన్ వికారాబాద్ జిల్లా :- పూడూరు మండలం లోని చింతలపల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో బడి బాట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రీ-స్కూల్ పూర్తి చేసిన చిన్నారులకు సర్టిఫికెట్లు, యూనిఫాంలను పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించి, చిన్నారులను పాఠశాలల్లో చేర్పించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. విద్యాభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని అంగన్వాడి సెంటర్లో ప్రభుత్వ పాఠశాలలో అందిస్తున్న సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్, పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ సర్పంచ్, గర్భిణీలు, బాలింతలు, తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper